ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్‌లో తబ్లిగీ జమాత్ నిర్వహించిన మత సమ్మేళనానికి హాజరై క్వారెంటైన్ కోసం ముందుకురాని మధ్యప్రదేశ్ వాసులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ డెడ్‌లైన్ విధించారు. మర్కజ్‌కు హాజరై రాష్ట్రంలో దాక్కున్న వాళ్లంతా 24 గంటల్లోగా బయటకు రావాలని ఆదేశించారు. 24 గంటల్లో స్వయంగా బయటకు వచ్చి అధికారులకు రిపోర్టు చేయకపోతే క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని శివరాజ్ హెచ్చరించారు.
కాగా, గత నెలలో ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్‌లో తబ్లిగీ జమాత్ మత సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి భారత్‌తోపాటు వివిధ దేశాల నుంచి వచ్చిన మత పెద్దలు, సాధారణ జనం హాజరయ్యారు. దీంతో విదేశీయుల ద్వారా చాలా మంది భారతీయులకు కరోనా వైరస్ సోకింది. ఇది దేశవ్యాప్తంగా కరోనా మరింత విస్తరించడానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ క్వారెంటైన్‌కు ముందుకు రాకుండా దాక్కున్న తబ్లిగీలకు మధ్యప్రదేశ్ సీఎం డెడ్‌లైన్ విధించారు.