పోలీసులు నా ఇంటిపై దాడి చేశారు: బీజేపీ ఎంపీ

పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ప్రభుత్వం తన కుటుంబంబపై వేధింపులకు పాల్పడుతోందని బీజేపీ ఎంపీ శాంతను ఠాకూర్‌ (పశ్చిమబెంగాల్‌) ఆరోపించారు. జీరో అవర్‌లో ఎంపీ శాంతను ఠాకూర్‌ మాట్లాడుతూ..తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన జిల్లా యంత్రాంగం, పోలీసులు తన ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు. తాను బీజేపీ పార్టీ నుంచి పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి టీఎంసీ తన కుటుంబాన్ని వేధిస్తుందని, ఎలాంటి కారణం లేకుండా పోలీసులు తన ఇంటిని చుట్టిముట్టి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.