ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటూనే ఉంటాయి. వాటిని అధిగమించి ప్రగతికాముకంగా ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఎప్పుడూ ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు. మనమూ విజయం సాధించాలి. మన పట్టణాలను మనమే మార్చుకోవాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సీఎం కర్తవ్యబోధ చేశారు. రాష్ట్రస్థాయి మున్సిపల్ సదస్సు మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగింది. నూతనంగా ఎన్నికైన మేయర్లు, చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, అధికారులు సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల పై ఉందన్నారు.
ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు.. మనమూ విజయం సాధించాలి: సీఎం కేసీఆర్